పదును
అదో అందమైన గ్రామం. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండల పక్క నుంచి గలగలపారే ఓ సెలయేరు ఉంది. దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కళకళలాడుతూ ఉండేవి. కానీ ఆ ఏడాది వర్షాలు సరిగా కురవలేదు. సెలయేరు ఎండిపోయింది. భూములన్నీ బీడులుగా మారిపోయాయి. చేసేదిలేక గ్రామ ప్రజలంతా పక్క గ్రామాలకు కూలి పనికోసం బయలుదేరారు. అలా వెళ్లిన వారిలో బలరాం కూడా ఒకడు. అతడు పేరుకు తగ్గట్టుగానే కండలు తిరిగిన బల వంతుడు. ఎంతటి బరువులనైనా సునాయాసంగా ఎత్తేసేవాడు.
ఓ కట్టెల వ్యాపారి దగ్గరకి వెళ్లి 'ఏదైనా పని ఉంటే ఇప్పించండి' అని అడిగాడు బలరాం.
'అడవికి వెళ్లి చెట్లు నరకాలి, చేయగలవా' అని వ్యాపారి అడిగాడు.
'చేయగలను' అన్నాడు బలరాం. 'రోజూ నువ్వు కొట్టే చెట్ల సంఖ్యనుబట్టి జీతం ఇస్తాను' అని వ్యాపారి చెప్పాడు.
'అలాగే' అంటూ గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు బలరాం. స్వతహాగా బలవంతుడు కావడంతో తొలిరోజే ఉత్సాహంగా పది చెట్లను నరికాడు.
ఇతడి పనితనం చూసిన వ్యాపారి అభినందిం
చాడు. ఆ రోజు రాత్రి తృప్తిగా భోజనం చేసి నిద్రపోయాడు బలరాం. మరునాడూ అదే ఉత్సాహంతో అడవికి వెళ్లాడు బలరాం. కానీ ఎనిమిది చెట్లనే కొట్టగలిగాడు. బలరాంకి తన సామర్థ్యం మీద కాస్త అనుమానం
ఆ మరుసటిరోజు ఆరు.... తరవాతి రోజు నాలుగు... ఇలా రోజురోజుకూ నరికే చెట్ల సంఖ్య తగిపోతోంది.
'ఏమైంది నాకు. నా బలం నెమ్మదిగా తగ్గిపోతోందా? ఇదో రోగమా?' తన కండబలంపై అనుమానం పెరిగింది బలరాంలో, ఆరోజే యజమాని దగ్గరకి వెళ్లాడు.
చిట్టి కథ
? 'అయ్యా... నాకేదో జబ్బు చేసింది. రోజురోజుకీ నా బలం తగిపోతోంది. ఇక పనిచెయ్యలేను. దయచేసి నన్ను పంపించేయండి' అన్నాడు వ్యాపారితో, కాసేపు ఆలోచించిన వ్యాపారి... 'ఏదీ, నీ గొడ్డలి తీసుకురా' అన్నాడు.
తీసుకొచ్చి ఇచ్చాడు బలరాం. గొడ్డలిని కాసేపు పరిశీలించి... 'బలరాం... నీ భుజ బలంతో మాత్రమే ఇన్నాళ్లూ పని చేశావ్, కానీ బుద్దిబలాన్ని వాడటంలేదు. చెట్టు కొట్టిన తరవాత గొడ్డలి పదును తగ్గుతుంది. వెంటనే దాన్ని పదును చెయ్యాలి. లేదంటే మొద్దుబారిపోతుంది. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పనిచేస్తున్నావు. కండ బలం ఉన్నంత మాత్రాన ఎవ్వరూ సమర్థులు కారు, దానికి బుద్ధిబలం తోడవ్వాలి' అని చెప్పాడు వ్యాపారి. పొరపాటు తెలుసుకున్న బలరాం గొడ్డలికి పదును పెట్టాడు. ఆ మరునాడు ఉత్సాహంగా అడవికి వెళ్లి,
మొదటి రోజులాగే పది చెట్లను నరకగలిగాడు.
Superb
ReplyDelete