Skip to main content

Posts

మన భారతీయ వైభవం ----ఒరిస్సా రాష్ట్రం

    భువనేశ్వర్ విశేషాలు  ఇంతకు ముందు బ్లాగ్ లో రెండు ప్రదేశాలు చూసాము..ఇప్పుడు మరొక ప్రదేశం :లింగరాజు ఆలయం     చరిత్ర : లింగరాజ అనగా లింగాలకు రాజు అనే అర్థము. ఈ ఆలయం లో  లింగమునకు త్రిభువనేశ్వర అనే పేరు కలదు. స్థలపురాణం ఓసారి పరమేశ్వరుడు తనకు కాశీతోపాటూ భువనేశ్వర్ ప్రాంతమూ ఇష్టమని పార్వతీదేవితో చెప్పాడట. దాంతో పార్వతీదేవి పశువులను కాచే గొల్లభామగా మారిఇక్కడకు వచ్చిందట. ఆ సమయంలో కృతి, వాస అనే ఇద్దరు అసురులు అమ్మవారిని చూసి తమని వివాహమాడమంటూ వేధించడంతో పార్వతీ ఆ రాక్షసుల్ని సంహరించిందట. అప్పుడు పార్వతీదేవికి కలిగిన దాహాన్ని తీర్చేందుకూ, ఆగ్రహాన్ని అదుపు చేసేందుకూ పరమేశ్వరుడు ఇక్కడకు వచ్చి బిందుసాగర్ అనే సరస్సును సృష్టించి ఆ తరువాత ఈ ప్రాంతంలోని మామిడిచెట్టుకింద స్వయంభువుగా కొలువుదీరాడని కథనం.  ఆలయ విశేషాలు:        స్వామిని త్రిభువనేశ్వరుడిగానూ పిలిచే ఈ ఆలయంలో విమాన, జగమోహన, భోగమండప, నటమందిరాలు ప్రధాన ఆకర్షణగా నిలిస్తే... వాటి చుట్టూ వందకు పైగా ఉపాలయాలు కనిపిస్తూ భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా దీపారాధన చేసి...
Recent posts

మన భారతీయ వైభవం.... ఒరిస్సా రాష్ట్రం

 ఒరిస్సా లో చూడదగిన ప్రదేశాలు.   మన దేశం ఎన్నో వింతలకు విశేషాలు కు నిలయం. అందులో ముఖ్యం గా చూడదగిన ప్రదేశం ఒరిస్సా. అందులో ముందు గా భువనేశ్వర్ గురించి తెలుసుకుందాం. భువనేశ్వర్ ఒరిస్సా రాష్ట్రం రాజధాని. భువనేశ్వర్ లో అనేక టూరిస్ట్ ప్లేస్ లు చూపరులకు కనువిందు చేసే విధం గా ఉన్నాయి.   1.రాజా రాణి మందిర్   భువనేశ్వర్ లో మందిరాలు అన్ని వాళ్ల సంస్కృతి ని ప్రతిభంభించే విధం గా ఉన్నాయి. ఈ మందిరలం లో దేవుని ప్రతిమ లు లేవు. అ కాలం లో రాజుల లోతైన వాలే ఉంది. గార్డెనింగ్ చాలా అద్భుతం గా ఉంటుంది. మొదటలో ఇందుకొరకు 20/ టికెట్ చెల్లించాలి 2.ముక్తాఈశ్వర్ టెంపుల్ ముక్తేశ్వర్ మందిర్ ఇక్కడ శివుని మందిరాలు మొత్తం 3:1.కేదారేశ్వర్                                 2.పరశురేశ్వర్                                 3.ముక్తేశ్వర్ చూడడానికి ఈ ఆలయం ఒరిస్సా సంస్కృతి, కళింగరాజుల వైభవం తెలియచేస్తాయి. భువనేశ్వర్ నుండి ఈ మందిరాలు అన్ని చాలా తక్కువ దూర...

పదును

  ‌పదును అదో అందమైన గ్రామం. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండల పక్క నుంచి గలగలపారే ఓ సెలయేరు ఉంది. దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కళకళలాడుతూ ఉండేవి. కానీ ఆ ఏడాది వర్షాలు సరిగా కురవలేదు. సెలయేరు ఎండిపోయింది. భూములన్నీ బీడులుగా మారిపోయాయి. చేసేదిలేక గ్రామ ప్రజలంతా పక్క గ్రామాలకు కూలి పనికోసం బయలుదేరారు. అలా వెళ్లిన వారిలో బలరాం కూడా ఒకడు. అతడు పేరుకు తగ్గట్టుగానే కండలు తిరిగిన బల వంతుడు. ఎంతటి బరువులనైనా సునాయాసంగా ఎత్తేసేవాడు. ఓ కట్టెల వ్యాపారి దగ్గరకి వెళ్లి 'ఏదైనా పని ఉంటే ఇప్పించండి' అని అడిగాడు బలరాం. 'అడవికి వెళ్లి చెట్లు నరకాలి, చేయగలవా' అని వ్యాపారి అడిగాడు. 'చేయగలను' అన్నాడు బలరాం. 'రోజూ నువ్వు కొట్టే చెట్ల సంఖ్యనుబట్టి జీతం ఇస్తాను' అని వ్యాపారి చెప్పాడు. 'అలాగే' అంటూ గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు బలరాం. స్వతహాగా బలవంతుడు కావడంతో తొలిరోజే ఉత్సాహంగా పది చెట్లను నరికాడు. ఇతడి పనితనం చూసిన వ్యాపారి అభినందిం చాడు. ఆ రోజు రాత్రి తృప్తిగా భోజనం చేసి నిద్రపోయాడు బలరాం. మరునాడూ అదే ఉత్సాహంతో అడవికి వెళ్లాడు బలరాం. కానీ ఎనిమిది చెట్లన...

అమ్మ మాట

  అమ్మ మాట ఒక అడవిలో ఒక అల్లరి కోతిపిల్ల ఉండేది. అది ఎవరి మాటా వినేది కాదు. ఆ అడవిని ఆనుకుని ఒక పెద్ద చెరువు ఉంది. అందులో ఒక చిన్న తాబేలుపిల్ల ఉండేది, కోతిపిల్లకు దానితో చెలిమి కుదిరింది. కోతిపిల్లకు తాను గూడా తాబేలులాగా నీటిలో తిరగాలని చాలా కోరిక, కానీ దానికి ఈత రాదు. దాంతో ఒక చిన్నపడవ తయారు చేసింది. దానిలో ఎక్కి తాబేలుతోబాటు చెరువంతా తిరగసాగింది. అది చూసి కోతిపిల్ల తల్లి "పాపా... ఏదయినా ఆపద వచ్చినప్పుడు నిన్ను నీవు కాపాడుకోనన్నా కాపాడుకోగలగాలి లేదా కాపాడే వాడన్నా పక్కనుండాలి. అందుకే చెరువులో షికారు చేయొద్దు" అంది. కానీ కోతిపిల్ల అమ్మకి తెలియకుండా అలాగే తిరగసాగింది. ఒకసారి కోతిపిల్ల చెరువులో తిరుగుతుంటే పెద్దగాలి వీయసాగింది. చెరువంతా అల్లకల్లోలమై అలలు ఎగిసిపడసాగాయి. పడవ అటూయిటూ ఊగిపోసాగింది. దానిలోకి నీళ్ళు ఎగిరి పడసాగాయి. దాంతో పడవ కొంచం కొంచం మునిగిపోసాగింది. అది చూసి తాబేలు "రా... తొందరగా వచ్చి నా మీదకు ఎక్కు నిన్ను వేగంగా ఒడ్డుకు తీసుకుపోతాను" అంది. కోతిపిల్ల సరేనని తాబేలు మీదకు ఎక్కింది. కానీ తాబేలేమో చిన్నది. కోతి పిల్లేమో పెద్దది. దాంతో దాని బరువును మోయల...

అహంకారం అసలు శత్రువు

అహంకారమే అసలు శత్రువు! ఒకసారి ఓ సింహం అడవిలోంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది. వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి. సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది. 'అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా..? కాసైనా హుందాతనం ఉండక్కర్లేదా?! మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు' అని అడిగాయని కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ.. ఉఫ్ అంటే ఎగిరిపోతారు, కంటికి సరిగా కనిపించనైనా కనిపించరు, మృగరాజునైన నన్నే ఎదిరిస్తారా మీరు?' అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయింది. చెదపురుగులకు చాలా కోపం వచ్చింది. 'ఎలాగైనా ఆ సింహం పొగరు అణచాలి' అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. అప్పటి నుంచీ కనిపించిన చెట్లనూ, మొక్కల్నీ పట్టాయి. చూస్తుండగానే కుందేళ్లూ, జింకలూ, దుప్పుల్లాంటి జంతువులకు ఆహారం దొరక్కుండా చేశాయి. దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరోచోటకు వెళ్లిపోయాయి. వేటాడదామంటే  కనిపించకపోయే సరికి సింహం అవాక్కైంది. తన తాతముత్తాతల నుంచీ వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. గత్యంతరం లేక మరో అడవిలోకి అడుగుపెట్టింది. చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండ...

3 THINGS TO REMEMBER

    Nice words from BUDDA       Hai,these three quotes are very important in everybodylife. Who helped us in difficult times: I want to say few things about this line.One day an ant fell into the water. Then the dove that was there snatched a leaf and saved it. A few days later the dove got caught by the hunter.Here The ant showed it's thankfulness by helping the dove.          Next we move into second step. Who left you in difficult times: One day two friends were traveling in the jungle when a bear intercepted them. One of them could not climb the tree.one who knows to climb a tree .He immediately climb a tree.Others situation is question mark.But he talently manage it.Here we have to know one thing that is we rember always who left you in difficult times.                 Next we move on to third step.   WHO PUT YOU IN DIFFICULT TIMES:.            This is t...

RULES FOR BRIGHT FUTURE

            Rules to be followed for bright future.                 Here I would like to say one lady story.She is not a great star or anything.She just like an ordinary woman.Her name was Indu.Lets look about her life.               HARDWORK:                          When she is carrying a 8 months baby.She wanted to start a new business.She is working very hard to start a shop.Suddenly she suffered from a pain.She neglect that pain and again she involved in her work.In that her hard work is reflected.Only one thing in her mind is to start a business tomorrow               In that story we know about the importance of HARDWORK.   DEDICATION:                  Whatever the work she put complete efforts in that.Dedication means means...