భువనేశ్వర్ విశేషాలు
ఇంతకు ముందు బ్లాగ్ లో రెండు ప్రదేశాలు చూసాము..ఇప్పుడు మరొక ప్రదేశం :లింగరాజు ఆలయం
చరిత్ర :
లింగరాజ అనగా లింగాలకు రాజు అనే అర్థము. ఈ ఆలయం లో లింగమునకు త్రిభువనేశ్వర అనే పేరు కలదు.
స్థలపురాణం
ఓసారి పరమేశ్వరుడు తనకు కాశీతోపాటూ భువనేశ్వర్ ప్రాంతమూ ఇష్టమని పార్వతీదేవితో చెప్పాడట. దాంతో పార్వతీదేవి పశువులను కాచే గొల్లభామగా మారిఇక్కడకు వచ్చిందట. ఆ సమయంలో కృతి, వాస అనే ఇద్దరు అసురులు అమ్మవారిని చూసి తమని వివాహమాడమంటూ వేధించడంతో పార్వతీ ఆ రాక్షసుల్ని సంహరించిందట. అప్పుడు పార్వతీదేవికి కలిగిన దాహాన్ని తీర్చేందుకూ, ఆగ్రహాన్ని అదుపు చేసేందుకూ పరమేశ్వరుడు ఇక్కడకు వచ్చి బిందుసాగర్ అనే సరస్సును సృష్టించి ఆ తరువాత ఈ ప్రాంతంలోని మామిడిచెట్టుకింద స్వయంభువుగా కొలువుదీరాడని కథనం.
ఆలయ విశేషాలు:
స్వామిని త్రిభువనేశ్వరుడిగానూ పిలిచే ఈ ఆలయంలో విమాన, జగమోహన, భోగమండప, నటమందిరాలు ప్రధాన ఆకర్షణగా నిలిస్తే... వాటి చుట్టూ వందకు పైగా ఉపాలయాలు కనిపిస్తూ భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా దీపారాధన చేసి ముఖ్యమందిరాల్లోకి ప్రవేశ అర్హతను పొందాకే హరిహరుడి రూప పరమేశ్వరుడిని పూజిస్తారు. ఆ తరువాత ఈ ఆలయం చుట్టూ ఉండే పార్వతీదేవి, కార్తికేయ, గణేశుడు, గోపాలుడు, సూర్యుడు, బలరాముడు, సహదేవుడు, కృష్ణుడు, శివలింగాలు అన్నీ కలిపి మొత్తంగా వందకు పైగా ఉపాలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ నందీశ్వరుడికీ ప్రత్యేక ఆలయం ఉంది.

Comments
Post a Comment